జడ్జీల సంఖ్య పెంపుతోనే పరిష్కారం లభించదు

న్యాయస్థానాల్లో భారీ స్థాయిలో ఉన్న పెండింగ్‌ కేసుల సమస్యకు జడ్జీల సంఖ్యను రెట్టింపు చేయడంతోనే పరిష్కారం లభించదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు.

Published : 30 Nov 2022 04:59 IST

సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌

దిల్లీ: న్యాయస్థానాల్లో భారీ స్థాయిలో ఉన్న పెండింగ్‌ కేసుల సమస్యకు జడ్జీల సంఖ్యను రెట్టింపు చేయడంతోనే పరిష్కారం లభించదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. సమర్థులైన జడ్జీలతో పాటు న్యాయస్థానాల్లో తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలూ అవసరమేనని తెలిపారు. అలహాబాద్‌ హైకోర్టులో మంజూరైన 160 న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయడమే కష్టంగా ఉందన్నారు. బాంబే హైకోర్టులో ఇప్పటి కన్నా అదనంగా ఒక్క జడ్జీని కూడా జత చేయలేమని, వసతుల కొరతే అందుకు కారణమని పేర్కొన్నారు. జిల్లా, హైకోర్టుల జడ్జీల పోస్టులను ప్రస్తుతమున్న దానికన్నా రెట్టింపు చేసేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు చేపట్టేందుకు నిరాకరిస్తూ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ధర్మాసనంలో జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా కూడా ఉన్నారు. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని ధర్మాసనానికి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని