న్యాయపోరాటం చేసి.. ఒక్కటైన యువతుల జంట
కేరళకు చెందిన ఇద్దరు యువతులు అన్ని అడ్డంకులు దాటుకొని ఒక్కటయ్యారు. అదిలా నసరిన్, ఫాతిమా నూర అనే ఇద్దరు యువతులు హైకోర్టులో న్యాయపోరాటం చేసి మరీ ఏకమయ్యారు.
కేరళకు చెందిన ఇద్దరు యువతులు అన్ని అడ్డంకులు దాటుకొని ఒక్కటయ్యారు. అదిలా నసరిన్, ఫాతిమా నూర అనే ఇద్దరు యువతులు హైకోర్టులో న్యాయపోరాటం చేసి మరీ ఏకమయ్యారు. అంగరంగ వైభవంగా వేడుక నిర్వహించుకొని దండలు, ఉంగరాలు మార్చుకున్నారు. అదిలా, ఫాతిమాలకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. ఈ క్రమంలోనే జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వీరి నిర్ణయాన్ని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది మే నెలలో కోజికోడ్ నుంచి పారిపోయారు. అదిలా కుటుంబ సభ్యులు వారు షెల్టర్ హోమ్‌కు వచ్చి యువతులకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లారు. కానీ ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులు మళ్లీ ఇద్దరినీ విడదీశారు. దీంతో అదిలా కేరళ హైకోర్టును ఆశ్రయించింది. తన భాగస్వామితో కలిసి ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. విచారణ జరిపిన ధర్మాసనం అదిల, ఫాతిమాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్
-
Sports News
IND vs AUS: స్టీవ్ స్మిత్‌ని ఆ స్పిన్నర్ ఇబ్బందిపెడతాడు: ఇర్ఫాన్ పఠాన్
-
India News
Modi: మోదీనే మోస్ట్ పాపులర్.. బైడెన్, రిషి సునాక్ ఏ స్థానాల్లో ఉన్నారంటే..?
-
Politics News
Revanth reddy: రాజ్‌భవన్ వేదికగా ఆ ఇద్దరూ డ్రామాకు తెరలేపారు: రేవంత్ రెడ్డి
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Crime News
Hyderabad: భాగ్యనగరంలో పేలుడు పదార్థాల కలకలం