ఉగ్రవాద కట్టడిలో ఉలేమా కీలక పాత్ర: దోభాల్
భారత్, ఇండోనేసియా దేశాలకు సీమాంతర ఉగ్రవాదం, ఐసిస్ ప్రమాదం నిత్యం పొంచి ఉన్నాయని, ముస్లిం యువత తీవ్రవాదం వైపు మొగ్గకుండా ప్రగతిశీల భావాలను బోధించడంలో ముస్లిం మత విద్వాంసులు (ఉలేమా) కీలక పాత్ర నిర్వహించాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ పేర్కొన్నారు.
దిల్లీ: భారత్, ఇండోనేసియా దేశాలకు సీమాంతర ఉగ్రవాదం, ఐసిస్ ప్రమాదం నిత్యం పొంచి ఉన్నాయని, ముస్లిం యువత తీవ్రవాదం వైపు మొగ్గకుండా ప్రగతిశీల భావాలను బోధించడంలో ముస్లిం మత విద్వాంసులు (ఉలేమా) కీలక పాత్ర నిర్వహించాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ పేర్కొన్నారు. ఇస్లాం మత ధర్మం, న్యాయసూత్రాలలో విద్వాంసులైన భారత్, ఇండోనేసియా ఉలేమాల సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం ఆయన ప్రసంగించారు. ఇండోనేసియా జాతీయ భద్రతా సలహాదారు, మంత్రి అయిన మహమ్మద్ మహఫూద్ నాయకత్వంలో ఆ దేశ ఉలేమా బృందం భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చింది. మార్చి 17న ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరిగిన భారత్-ఇండోనేసియా భద్రతా సంప్రదింపులలో దోభాల్ పాల్గొన్నప్పుడు, మహఫూద్‌ను భారత్‌కు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ప్రతినిధి వర్గంతో సోమవారం ఆయన భారత్ చేరుకున్నారు. రెండు దేశాల ఉలేమాతో, ఇతర మతాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో దోభాల్ మాట్లాడారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.