సుప్రీంను ఆశ్రయించిన బిల్కిస్‌ బానో

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార ఘటన మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

Published : 01 Dec 2022 03:47 IST

దోషుల విడుదలను సవాల్‌ చేస్తూ పిటిషన్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార ఘటన మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ కేసులో దోషులను గుజరాత్‌ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ బాధితురాలు బిల్కిస్‌.. తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దోషులకు రెమిషన్‌ పాలసీని అమలు చేసేందుకు సుప్రీంకోర్టు గతంలో గుజరాత్‌ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ బుధవారం ఆమె సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందుకు తీసుకొచ్చినట్లు బాధితురాలి తరఫు న్యాయవాది శోభా గుప్తా తెలిపారు. దీన్ని ఓపెన్‌ కోర్టులో విచారించాలని బాధితురాలి తరఫు న్యాయవాది కోరగా.. ఆ విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌ను స్వీకరించిన సీజేఐ.. దోషుల విడుదలపై గతంలో దాఖలైన పిటిషన్‌తో కలిపి దీన్ని విచారించొచ్చా? లేదా? అన్న అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిల్కిస్‌ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు