నేటి నుంచి చారిత్రక కట్టడాలపై జి-20 వెలుగులు

దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద భవనాలు డిసెంబరు 1 నుంచి వారం రోజుల పాటు జి-20 చిహ్నంతో కూడిన వెలుగుల్ని పంచనున్నాయి.

Published : 01 Dec 2022 03:47 IST

దిల్లీ: దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద భవనాలు డిసెంబరు 1 నుంచి వారం రోజుల పాటు జి-20 చిహ్నంతో కూడిన వెలుగుల్ని పంచనున్నాయి. ఈ కూటమికి గురువారం నుంచి ఏడాదిపాటు మన దేశం నేతృత్వం వహించనున్న సందర్భంగా తాజ్‌మహల్‌, ఆగ్రా కోట మొదలుకుని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) పర్యవేక్షణలో ఉన్న 100 భవంతుల్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించనున్నారు. వీటిలో యునెస్కో జాబితాలోని కట్టడాలూ ఉన్నాయి. పర్యాటక అవగాహన కార్యక్రమంలో భాగంగా పలువురు డ్రైవర్లకు నైపుణ్య శిక్షణ ధ్రువపత్రాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి బుధవారం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని