వరుడు ముద్దు పెట్టాడని వధువు ఆగ్రహం.. పెళ్లి రద్దు
మెడలో మాల వేస్తున్న సమయంలో వరుడు తనకు ముద్దు పెట్టాడని ఆగ్రహించిన ఓ వధువు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది.
మెడలో మాల వేస్తున్న సమయంలో వరుడు తనకు ముద్దు పెట్టాడని ఆగ్రహించిన ఓ వధువు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగింది. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద బదాయూలోని బిల్సీకి చెందిన యువకుడికి బహ్జోయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నవంబరు 26న వివాహం జరిగింది.
29న (మంగళవారం) వరుడు.. కుటుంబ సభ్యులతో పాటు వధువు గ్రామానికి చేరుకున్నాడు. పెళ్లి ఆచారాల్లో భాగంగా వధువు మెడలో మాల వేస్తున్న సమయంలో వరుడు ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. కోపోద్రిక్తురాలైన ఆ యువతి పెళ్లి రద్దుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఓ చిన్నపాటి గొడవ జరగ్గా.. విషయం పంచాయతీ వరకు వెళ్లింది. అయినా.. వధువు నిర్ణయం మారలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు