సెలవులే లేని పాఠశాల

ఏడాదిలో ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ఓ పాఠశాల నడుస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగుతోంది.

Published : 01 Dec 2022 08:52 IST

ఏడాదిలో ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ఓ పాఠశాల నడుస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగుతోంది. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌ తాలూకాలో ఈ పాఠశాల ఉంది. హివాలి గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల సెలవులు లేకుండా నడవడమే కాకుండా.. అనేక ప్రత్యేకతలకు కేంద్రంగా నిలుస్తోంది. కేశవ్‌ గావిత్‌ అనే ఉపాధ్యాయుడు ఈ పాఠశాలలో మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు కేవలం పుస్తకాల్లోని విషయాలనే బట్టీ పట్టకుండా.. ఉద్యోగ నైపుణ్యాలపై దృష్టి పెట్టేలా కృషి చేశారు. 8గంటలు పుస్తకాల్లో ఉన్న విషయం చెప్పి.. ఆ తర్వాత 4 గంటలపాటు ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని