ఆలయ ఏనుగు అంతిమ యాత్రకు పోటెత్తిన భక్తులు

పుదుచ్చేరిలో ఆలయ ఏనుగు మరణించడం భక్తుల్లో విషాదాన్ని నింపింది. ఆ ఏనుగు అంతిమ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని నివాళులర్పించారు.

Published : 01 Dec 2022 03:47 IST

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నివాళి

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో ఆలయ ఏనుగు మరణించడం భక్తుల్లో విషాదాన్ని నింపింది. ఆ ఏనుగు అంతిమ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని నివాళులర్పించారు. పుదుచ్చేరిలో మణకుళ వినాయక ఆలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయానికి 1955లో లక్ష్మీ అనే ఐదేళ్ల గున్న ఏనుగును కానుకగా ఇచ్చారు. ఆనాటి నుంచి ఆలయ సేవల్లో పాల్గొన్న లక్ష్మీ భక్తులకు ప్రీతిపాత్రమైంది. దాని కాలికి ఏర్పడిన పుండుతో కొన్ని రోజులుగా బాధపడింది. బుధవారం తెల్లవారుజామున నడక కోసం తీసుకువెళ్లగా కుప్పకూలింది. అక్కడికి వచ్చిన వైద్యులు, మావటి ఆ ఏనుగును కాపాడేందుకు పలు ప్రయత్నాలు చేసినా ప్రాణాలు దక్కలేదు. ఆలయం ఎదుట కళేబరాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెలంగాణ గవర్నరు, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నివాళులర్పించారు. ఆలయానికి వెళ్లిన సందర్భాల్లో లక్ష్మీతో తనకున్న అనుబంధాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని