బల్బుల కాంతి నుంచి విద్యుత్తు తయారీ

ఇళ్లలో సీఎఫ్‌ఎల్‌, ఎల్‌ఈడీ బల్బుల కాంతి నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు దోహదపడే సరికొత్త పరికరాన్ని ఐఐటీ-మండీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) పరికరాలు ప్రస్తుతం బ్యాటరీల ఆధారంగానే పనిచేస్తున్నాయి.

Published : 01 Dec 2022 04:12 IST

ఐఐటీ-మండీ శాస్త్రవేత్తల పరిశోధన

మండీ: ఇళ్లలో సీఎఫ్‌ఎల్‌, ఎల్‌ఈడీ బల్బుల కాంతి నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు దోహదపడే సరికొత్త పరికరాన్ని ఐఐటీ-మండీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) పరికరాలు ప్రస్తుతం బ్యాటరీల ఆధారంగానే పనిచేస్తున్నాయి. జీవితకాలం ముగిసిన బ్యాటరీలతో పర్యావరణానికి హాని కలుగుతుండటంపై ఐఐటీ పరిశోధకులు దృష్టి సారించారు. బల్బులు వంటి కృత్రిమ వనరుల నుంచి కాంతిని గ్రహించి, విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ‘థిన్‌-ఫిల్మ్‌ ఎఫీషియంట్‌ ఫొటోవోల్టాయిక్‌ సెల్స్‌’ను రూపొందించారు. వీటితో సెన్సర్లు, వైఫై రూటర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ రీడర్లు వంటి ఐవోటీ పరికరాలు సమర్థంగా పనిచేస్తాయని పరిశోధకులు తెలిపారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ, యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌, గౌతమ్‌ బుద్ధ విశ్వవిద్యాలయం నిపుణులు కూడా ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని