దావూద్‌ అండతో మాజీ మంత్రి భూ కబ్జా?

నగదు అక్రమ చలామణి కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌కు బెయిలు ఇవ్వడానికి బుధవారం ఇక్కడి ప్రత్యేక కోర్టు నిరాకరించింది.

Published : 01 Dec 2022 04:55 IST

ముంబయి: నగదు అక్రమ చలామణి కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌కు బెయిలు ఇవ్వడానికి బుధవారం ఇక్కడి ప్రత్యేక కోర్టు నిరాకరించింది. నగదు అక్రమ చలామణి నిరోధ చట్టం(పీఎంఎల్‌ఏ) పరిధిలోకి వచ్చే కేసులను జస్టిస్‌ ఆర్‌.ఎన్‌. రోకడే నాయకత్వంలోని ప్రత్యేక న్యాయస్థానం విచారిస్తోంది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) సీనియర్‌ నాయకుడైన మాలిక్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, ఆయన సోదరి హసీనా పార్కర్‌లతో సన్నిహిత సంబంధాలున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గతంలో ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసింది. హసీనాతో పాటు ఇతర దావూద్‌ అనుచరులతో కలసి మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌ ముంబయిలోని కుర్లా ప్రాంతంలో మునీరా అనే మహిళకు చెందిన రూ.300 కోట్ల ఆస్తిని కబ్జా చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు పెట్టింది. తాను ఈ ఆస్తిని మాలిక్‌కు విక్రయించనే లేదని మునీరా ఈడీకి లిఖిత ప్రకటన ఇచ్చారు. ఈ ఆస్తిని అమ్మగా వచ్చిన మొత్తాన్ని సక్రమ ధనంగా చలామణి చేయడానికి మాలిక్‌, హసీనా, సలీం పటేల్‌ కలసి కుట్రపన్నారని ఈడీ ఆరోపణ.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు