Sonu sood: మరోసారి పెద్ద మనసు చాటుకున్న నటుడు సోనూసూద్
కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన సినీ నటుడు సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
సారంగి వాయిద్యకారుడి వైద్యానికి హామీ
కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన సినీ నటుడు సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సారంగి వాయిద్యకారుడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఓ ట్విటర్ యూజర్ పెట్టిన పోస్టుకు స్పందించిన సోనూసూద్.. సారంగి వాయిద్యకారుడికి సహాయం చేస్తానని తిరిగి రీట్వీట్ చేశారు.
హరియాణాకు చెందిన సారంగి వాయిద్యకారుడు మమన్‌ఖాన్(83) ఆరోగ్యం బాగాలేదని, సాయానికి ఎవరు ముందుకు రావట్లేదని ఇంద్రజిత్ బర్కే అనే వ్యక్తి ట్విటర్ ద్వారా పోస్ట్ చేశాడు. అతని ఫోటో జత చేస్తూ, ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన సోనూసూద్ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ‘ఖాన్ సాహిబ్, ముందు మీ ఆరోగ్యం నయం చేస్తా, తర్వాత మీ సారంగి పాట వింటా’ అని రీట్వీట్ చేశారు. హిసార్ జిల్లా ఖరక్‌పుర్ గ్రామానికి చెందిన మమన్‌ఖాన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్రపతి అవార్డు సైతం అందుకున్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న ఆయన.. సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Amigos: ఆ పాట చూశాక అందరూ షాక్ అవుతారు: కల్యాణ్ రామ్
-
India News
Subramanian Swamy: అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి.. వేలం వేయాలి..!
-
Sports News
IND vs AUS: తొలి టెస్టు కోసం దినేశ్ కార్తిక్ ప్లేయింగ్ XI ఇదే!.. గిల్, కుల్దీప్కు దక్కని చోటు
-
Politics News
Mekapati Chandrasekhar Reddy: వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత
-
India News
Modi: ‘బ్లూ జాకెట్’తో ‘గ్రీన్’ మెసేజ్ ఇచ్చిన ప్రధాని మోదీ..!
-
World News
Chinese Spy Balloon: భారత్‌పై చైనా బెలూన్ గూఢచర్యం..!