శ్రీశ్రీ రవిశంకర్‌కు శాంతిదూత అవార్డు ప్రదానం

భారత ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌కు ఆమెరికాలోని మెంఫిస్‌లో నేషనల్‌ సివిల్‌ రైట్స్‌ మ్యూజియం ప్రతిష్ఠాత్మక ‘ది ఎమిసరీ ఆఫ్‌ పీస్‌’ (శాంతిదూత) అవార్డును ప్రదానం చేసింది.

Published : 02 Dec 2022 03:40 IST

వాషింగ్టన్‌: భారత ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌కు ఆమెరికాలోని మెంఫిస్‌లో నేషనల్‌ సివిల్‌ రైట్స్‌ మ్యూజియం ప్రతిష్ఠాత్మక ‘ది ఎమిసరీ ఆఫ్‌ పీస్‌’ (శాంతిదూత) అవార్డును ప్రదానం చేసింది. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ను స్థాపించిన రవిశంకర్‌ దాని ద్వారా ప్రాణాయామం, ఒత్తిడి నివారణ, యోగా, ధ్యానంపై స్వచ్ఛందంగా బోధిస్తున్నారు. అవార్డు ప్రదానం సందర్భంగా నేషనల్‌ సివిల్‌ రైట్స్‌ మ్యూజియం బోర్డు డైరెక్టర్‌ శైలా కర్కెరా మాట్లాడుతూ.. ‘ది ఎమిసరీ ఆఫ్‌ పీస్‌’ పురస్కారాన్ని శ్రీశ్రీ రవిశంకర్‌కు అందించడాన్ని గౌరవప్రదంగా, ఆనందంగా భావిస్తున్నామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని