‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ వివాదం.. ఇఫి జ్యూరీ అధ్యక్షుడి క్షమాపణలు

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఇజ్రాయెల్‌ దర్శకుడు, ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఇఫి)కి అధ్యక్షుడిగా వ్యవహరించిన నడవ్‌ లాపిడ్‌ పేర్కొన్నారు.

Published : 02 Dec 2022 03:40 IST

దిల్లీ: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఇజ్రాయెల్‌ దర్శకుడు, ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా(ఇఫి)కి అధ్యక్షుడిగా వ్యవహరించిన నడవ్‌ లాపిడ్‌ పేర్కొన్నారు. ఆయన ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఎవరినీ అవమానించాలన్నది తన ఉద్దేశం కాదని, అయితే తాను చేసిన వ్యాఖ్యలు కొందరిని బాధించేలా వక్రీకరణకు గురై ఉంటే, వారికి తాను క్షమాపణలు చెబుతున్నానన్నారు. గోవాలో ఇటీవల జరిగిన ఇఫి వేడుకల్లో ఇతర చిత్రాలతోపాటు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’నూ ప్రదర్శించారు. జ్యూరీ అధ్యక్షుడి హోదాలో నడవ్‌ మాట్లాడుతూ.. ‘‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని