హెచ్‌ఐవీ బాధితులకో గ్రామం..

మహారాష్ట్రలోని లాతుర్‌ జిల్లాకు చెందిన రవి బాపట్ల అనే వ్యక్తి తన ఉద్యోగాన్ని వదులుకొని.. హెచ్‌ఐవీ బారిన పడ్డవారికి ఆశ్రయం కల్పించి వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు.

Published : 02 Dec 2022 03:40 IST

మహారాష్ట్రలోని లాతుర్‌ జిల్లాకు చెందిన రవి బాపట్ల అనే వ్యక్తి తన ఉద్యోగాన్ని వదులుకొని.. హెచ్‌ఐవీ బారిన పడ్డవారికి ఆశ్రయం కల్పించి వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. ఈ మేరకు  2007లో హెచ్‌ఐవీ బాధితుల కోసం ‘హ్యాపీ ఇండియన్‌ విలేజ్‌’ను రవి నెలకొల్పారు. ఎయిడ్స్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ఎందరో అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితులు ఈ సేవాలయంలో ఆశ్రయం పొందుతున్నారు. వారికి సమయానికి మందులు అందించి వారి బాగోగులు చూసుకుంటున్నారు రవి. ‘‘ఈ సేవాలయానికి మన్మతప్ప ముక్తా అనే వ్యక్తి 60 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం మా దగ్గర 85 మంది బాధితులు ఉన్నారు’’ అని రవి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని