బంగారంతో బుల్లి ఫిఫా వరల్డ్‌ కప్‌ ట్రోఫీ..

రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌కు చెందిన ఇక్బాల్‌ బంగారంతో ప్రపంచంలోనే అతిచిన్న ఫిఫా వరల్డ్‌ కప్‌ నమూనాను రూపొందించారు.

Published : 02 Dec 2022 03:40 IST

రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌కు చెందిన ఇక్బాల్‌ బంగారంతో ప్రపంచంలోనే అతిచిన్న ఫిఫా వరల్డ్‌ కప్‌ నమూనాను రూపొందించారు. ఇది సూది రంధ్రం గుండా వెళ్లగలిగేంత చిన్నది కావడం గమనార్హం. లెన్స్‌తో చూస్తేనే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్బాల్‌ ఇంతకు ముందు కూడా అతి చిన్న బంగారు ఆభరణాలను తయారు చేసి 100 రికార్డులను నెలకొల్పారు. అయితే ఈసారి ఆయన ఒక మి.మీ. పరిమాణంలో ఫిఫా వరల్డ్‌ కప్‌ ట్రోఫీని తయారుచేయడం విశేషం. ‘‘ఫిఫా పోటీల్లో గెలిచిన జట్టుకు ఈ బుల్లి ట్రోఫీని అందజేయాలనుకుంటున్నాను’’ అని ఇక్బాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని