లవ్‌ జిహాద్‌, మత మార్పిళ్లపై వీహెచ్‌పీ దేశవ్యాప్త ఉద్యమం

లవ్‌ జిహాద్‌, బలవంతపు మతమార్పిళ్లపై ప్రజల్లో అవగాహన కల్పించేలా దేశవ్యాప్త కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) గురువారం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Published : 02 Dec 2022 04:33 IST

దిల్లీ: లవ్‌ జిహాద్‌, బలవంతపు మతమార్పిళ్లపై ప్రజల్లో అవగాహన కల్పించేలా దేశవ్యాప్త కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) గురువారం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ జన్‌ జాగరణ్‌ అభియాన్‌ నెల రోజులపాటు కొనసాగుతుంది. యువతను, మహిళలను చైతన్యపరచడం తమ ఉద్దేశమని సంస్థ సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు దేశవ్యాప్తంగా అన్ని బ్లాకుల్లో ఈ నెల 10 వరకు ‘శౌర్య యాత్ర’లు నిర్వహిస్తారని చెప్పారు. ‘దుర్గావాహిని’ ద్వారా యువతుల్లో చైతన్యం తీసుకువస్తామని తెలిపారు. అక్రమ మత మార్పిళ్లపై కేంద్రం ఒక చట్టాన్ని చేయాల్సి ఉందని, దానికి తగ్గ మద్దతు కూడగడతామని వీహెచ్‌పీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని