ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఉప కార్యదర్శి అరెస్ట్‌

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీ ర్యాంకు అధికారిగా పనిచేస్తున్న సౌమ్యా చౌరాసియాను ఈడీ శుక్రవారం అరెస్టు చేసింది.

Published : 03 Dec 2022 05:15 IST

హవాలా కేసులో ఈడీ చర్య

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీ ర్యాంకు అధికారిగా పనిచేస్తున్న సౌమ్యా చౌరాసియాను ఈడీ శుక్రవారం అరెస్టు చేసింది. రాష్ట్రంలో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణానికి సంబంధించిన హవాలా విచారణలో భాగంగా ఈ అరెస్టు జరిగినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఐటీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్రంలో ఈడీ విచారణ చేపట్టింది. చురుకైన అధికారిణిగా పేరున్న సౌమ్యాను కస్టడీలోకి తీసుకోవడంతో హవాలా ఆరోపణలపై ఆమెను విచారించనున్నారు. వైద్యపరీక్షల అనంతరం సౌమ్యాను ఈడీ కోర్టులో హాజరుపరచగా, నాలుగు రోజుల రిమాండుకు ఆదేశాలు వెలువడ్డాయి. గత అక్టోబరులో ఐఏఎస్‌ అధికారి సమీర్‌ విష్ణోయ్‌తోపాటు మరో ఇద్దరిని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని