కొత్త జలవిద్యుత్తు కేంద్రాలకు.. ఐఎస్‌టీఎస్‌ ఛార్జీల మినహాయింపు

కొత్తగా నిర్మించే జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి సరఫరా చేసే విద్యుత్తుకు ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టం (ఐఎస్‌టీఎస్‌) ఛార్జీల్లో మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

Updated : 03 Dec 2022 06:13 IST

ఈనాడు, దిల్లీ: కొత్తగా నిర్మించే జలవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి సరఫరా చేసే విద్యుత్తుకు ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టం (ఐఎస్‌టీఎస్‌) ఛార్జీల్లో మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. పునరుత్పాదక ఇంధన విద్యుత్తును ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సౌర, పవన కేంద్రాల నుంచి సరఫరా చేసే విద్యుత్తుకు ఇప్పటికే ఈ మినహాయింపులు వర్తిస్తున్నాయి. 2030 నాటికి శిలాజ ఇంధనేతర విద్యుత్తు సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు తీసుకువెళ్లాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే 2019 మార్చిలో జలవిద్యుత్తు కేంద్రాలను పునరుత్పాదక ఇంధన కేంద్రాలుగా కేంద్రం ప్రకటించింది.  పునరుత్పాదక ఇంధన సంస్థలను ఒకేస్థాయికి తీసుకురావడానికి కొత్త జలవిద్యుత్తు కేంద్రాలకు ఐఎస్‌టీఎస్‌ ఛార్జీల రద్దును తాజాగా వర్తింపజేసింది. నిర్మాణపనులు 2025 జూన్‌ 30వ తేదీ తర్వాత కేటాయించి, పీపీఏలు కుదుర్చుకున్న సంస్థలకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని