దిల్లీ ఎయిమ్స్‌ సర్వర్ల హ్యాకింగ్‌లో చైనా హస్తం?

దేశ రాజధాని దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) సర్వర్ల హ్యాకింగ్‌ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Published : 03 Dec 2022 05:31 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) సర్వర్ల హ్యాకింగ్‌ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆసుపత్రిలో మొత్తం ఐదు ప్రధాన సర్వర్లు సైబర్‌ దాడికి గురవ్వగా.. వాటిలో ఒక సర్వర్‌ను హాంకాంగ్‌ నుంచి హ్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కుట్ర వెనుక చైనా హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఎయిమ్స్‌లో సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23న తొలిసారి గుర్తించారు. ఆ తర్వాత హ్యాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్‌ నుంచి హ్యాకర్లు రూ.200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సర్వర్లలో దాదాపు 4 కోట్ల మంది రోగుల సమాచారం నిక్షిప్తమై ఉంది. ప్రస్తుతం ఎయిమ్స్‌లో సర్వర్లు, కంప్యూటర్లకు యాంటీ వైరస్‌ సొల్యూషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఆసుపత్రిలో మొత్తం 5వేలకు పైగా కంప్యూటర్లు ఉండగా.. ఇప్పటివరకు 1200 కంప్యూటర్లకు యాంటీ వైరస్‌ ఎక్కించారు. 50 సర్వర్లలో 20 సర్వర్లను స్కాన్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రక్రియ పూర్తికి మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని