‘చేపల కూర’ వివాదంలో.. నటుడు పరేశ్‌ రావల్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, భాజపా ఎంపీ పరేశ్‌ రావల్‌ వివాదంలో చిక్కుకున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారి.. చివరకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

Updated : 03 Dec 2022 11:32 IST

అహ్మదాబాద్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, భాజపా ఎంపీ పరేశ్‌ రావల్‌ వివాదంలో చిక్కుకున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారి.. చివరకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. గుజరాత్‌ తొలివిడత ఎన్నికల ప్రచారంలో పరేశ్‌ రావల్‌ ప్రసంగించిన వీడియో వైరల్‌ అయ్యింది. ‘‘పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కొన్నిరోజులకు దిగి వస్తాయి. ప్రజలకు ఉద్యోగాలూ వస్తాయి. కానీ, దిల్లీ తరహాలో రొహింగ్యాలు, బంగ్లాదేశీలు మీ చుట్టూ చేరితే.. గ్యాస్‌ సిలిండర్లతో మీరేం చేసుకుంటారు? బెంగాలీలకు చేపలు వండిపెడతారా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు బెంగాలీలను అవమానించేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పరేశ్‌ స్పందించారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని