ఈ ఏడాది గూగుల్‌ మేటి యాప్స్‌ ఇవే..

ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌.. ఈ ఏడాది ఉత్తమ యాప్స్‌ జాబితాను ప్రకటించింది. భారత్‌లో ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్‌ అప్లికేషన్ల జాబితాను వెలువరించింది.

Published : 04 Dec 2022 06:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌.. ఈ ఏడాది ఉత్తమ యాప్స్‌ జాబితాను ప్రకటించింది. భారత్‌లో ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్‌ అప్లికేషన్ల జాబితాను వెలువరించింది. సాధారణ యాప్స్‌, గేమింగ్‌ యాప్స్‌ అందులో ఉన్నాయి.

షాప్సీ

ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన షాప్సీ ఈ ఏడాది ఎక్కువ ఆదరణ పొందిన యాప్‌గా నిలిచింది. ఈ యాప్‌లో సెల్లర్ల వద్ద కమీషన్‌ తీసుకోరు. ఎవరైనా సరే ఈ ఉత్పత్తులను తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా విక్రయించుకోవచ్చు. ఫ్యాషన్‌, మొబైల్‌, బ్యూటీ, ఫుట్‌వేర్‌ తదితర ఉత్పత్తులు ఇందులో లభిస్తాయి. ఉత్తమ రోజువారీ అవసరాలు తీర్చే యాప్‌ జాబితాలో ఈ యాప్‌నకు అగ్రస్థానం లభించింది.

క్వెస్ట్‌

విద్యార్థుల కోసం ఉద్దేశించిన క్వెస్ట్‌ సైతం అత్యుత్తమ యాప్‌గా నిలిచింది. కృత్రిమ మేధ ద్వారా విద్యార్థుల అవసరాలను తెలుసుకుని అందుకనుగుణంగా అభ్యసనాలను అందిస్తుంది. అలాగే నేర్చుకునే క్రమంలో వారికి గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడం ఈ యాప్‌ ప్రత్యేకత.

ఖ్యాల్‌

బెస్ట్‌ యాప్స్‌ ఫర్‌ గుడ్‌ విభాగంలో సీనియర్‌ సిటిజన్ల కోసం ఉద్దేశించిన ఖ్యాల్‌ అగ్రస్థానంలో నిలిచింది. వృద్ధులకు ప్రీపెయిడ్‌ కార్డులు అందించడం, వారి అవసరాలకు సంబంధించిన ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందించడం ఈ యాప్‌ ప్రత్యేకత.

బేబీజీ

బెస్ట్‌ హిడెన్‌ జెమ్స్‌ విభాగంలో బేబీజీ యాప్‌ అగ్రస్థానంలో నిలిచింది. చిన్నారుల వృద్ధిని గుర్తించే ట్రాకర్‌ ఇది. చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలు తెలుసుకోవడంతో పాటు చిన్నారులకు కావాల్సిన స్టోరీలు ఇందులో అందుబాటులో ఉంటాయి.

లూడో కింగ్‌

2016లో విడుదలైన లూడో కింగ్‌ యాప్‌నకు ఇప్పటికీ ప్రజాదరణ కొనసాగుతోంది. దీంతో ఆన్‌గోయింగ్‌ విభాగంలో లూడోకింగ్‌తోపాటు రియల్‌ క్రికెట్‌ 20నూ గూగుల్‌ ఎంపిక చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని