డీఎన్‌ఏ పరీక్షతో అత్యాచార ఆరోపణల నుంచి విముక్తి

మైనర్‌పై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న యువకుడు చివరకు డీఎన్‌ఏ పరీక్షల పుణ్యమా అని నిర్దోషిగా బయటపడ్డాడు.

Published : 04 Dec 2022 05:16 IST

పశ్చిమ బెంగాల్‌లో ఘటన

మైనర్‌పై అత్యాచారానికి పాల్పడి ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న యువకుడు చివరకు డీఎన్‌ఏ పరీక్షల పుణ్యమా అని నిర్దోషిగా బయటపడ్డాడు. పశ్చిమబెంగాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ మేదినీపుర్‌ జిల్లా కేశ్‌పుర్‌ చెందిన 13 ఏళ్ల బాలిక ఐదేళ్ల క్రితం పెళ్లికాకుండానే గర్భం దాల్చింది. ఇంటి పక్కన ఉన్న యువకుడే ఇందుకు కారణమని.. బాలిక కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పంచాయితీ పెట్టారు. తాను తప్పు చేయలేదని ఆ యువకుడు చెప్పినా ఎవరూ అతడి మాట నమ్మలేదు. బాధిత యువతిని పెళ్లి చేసుకోవాల్సిందిగా గ్రామ పెద్దలు తీర్మానించారు. వారి ఒత్తిడితో 22 ఏళ్ల యువకుడు.. మైనర్‌కు 18 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. తాను ఏ తప్పూ చేయలేదంటూ 2017లో మేదినీపుర్‌ జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఆమె గర్భానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించాడు. దీంతో డీఎన్‌ఏ పరీక్షలు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. బాలికకు జన్మించిన చిన్నారికి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడికి ఎటువంటి సంబంధం లేదని డీఎన్‌ఏ పరీక్షల్లో వెల్లడైంది. దీంతో యువకుడిపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు యువతి, ఆమె తల్లిని అరెస్ట్‌ చేయాల్సిందిగా పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదట పోలీసులు ఆ యువతిని అరెస్ట్‌ చేయలేదు. దీంతో యువకుడు మరోసారి కోర్టును ఆశ్రయించాడు. అనంతరం కోర్టు రెండోసారి ఆదేశించడంతో పోలీసులు ఆమెనూ అరెస్ట్‌ చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు