పంజాబ్‌లో 25 కేజీల హెరాయిన్‌, మందుగుండు స్వాధీనం

డ్రోన్‌ల ద్వారా మాదకద్రవ్యాలను భారత్‌లోకి చేరవేసే యత్నాలను పొరుగుదేశం పాకిస్థాన్‌ కొనసాగిస్తోంది. తాజాగా పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది పాకిస్థాన్‌ డ్రోన్‌ జారవిడిచిన 25 కేజీల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు.

Published : 04 Dec 2022 05:16 IST

చండీగఢ్‌: డ్రోన్‌ల ద్వారా మాదకద్రవ్యాలను భారత్‌లోకి చేరవేసే యత్నాలను పొరుగుదేశం పాకిస్థాన్‌ కొనసాగిస్తోంది. తాజాగా పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది పాకిస్థాన్‌ డ్రోన్‌ జారవిడిచిన 25 కేజీల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సరకును తీసుకోవడానికి వచ్చిన నలుగురు వ్యక్తులను గుర్తించి కాల్పులు జరపగా వారు పరారయ్యారు. ‘‘శుక్రవారం అర్ధరాత్రి 12.05 గంటలకు ఛురివాలా ఛుస్తీ గ్రామంలో పాకిస్థాన్‌ డ్రోన్‌ భారత్‌ భూభాగంలోకి ప్రవేశించడంతో భద్రతా బలగాలకు ఆ శబ్దం వినిపించింది. దీంతో వారు దానిపై కాల్పులు జరపడంతో అది వెనక్కి మళ్లింది. అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా 7.5 కేజీల హెరాయిన్‌, ఓ పిస్తోలు, రెండు మేగజీన్లు, 50 రౌండ్ల 9ఎంఎం గుళ్లు లభించాయి. ఆ తర్వాత లభించిన మరో ఏడు పొట్లాల్లో 17.5 కేజీల హెరాయిన్‌ దొరికింది’’ అని అని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు