కదిలే బస్సు షెల్టర్‌

ఎక్కడికైనా తరలించే వీలున్న బస్సు షెల్టర్‌ను కేరళకు చెందిన యువకులు తయారు చేశారు.

Published : 04 Dec 2022 05:16 IST

ఎక్కడికైనా తరలించే వీలున్న బస్సు షెల్టర్‌ను కేరళకు చెందిన యువకులు తయారు చేశారు. దీనిని ద్విచక్ర వాహనానికి కట్టి అవసరమైన ప్రాంతానికి తీసుకెళుతున్నారు. కాసర్‌గోడ్‌ జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా బస్సు షెల్టర్‌ను కూల్చివేశారు. దీంతో ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం కాసర్‌గోడ్‌ జిల్లా పెరియా ప్రాంతంలోని యువకుల దృష్టికి వచ్చింది. దీంతో వారు కదిలే వీలున్న బస్సు షెల్టర్‌ను నిర్మించాలని భావించారు. అందుకోసం ఆ ప్రాంతంలోని వ్యాపారులు, సామాజిక సంస్థలను సంప్రదించి నిధులను సేకరించారు. అనంతరం మొబైల్‌ బస్సు షెల్టర్‌ను నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని