స్కూల్‌ బ్యాగ్‌లో కుర్చీ.. తయారు చేసిన బాలిక

హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాకు చెందిన ఏకమ్‌జీత్‌ కౌర్‌ అనే బాలిక ‘మల్టీ స్పెషాలిటీ స్కూల్‌ బ్యాగ్‌’ను తయారుచేసింది.

Updated : 04 Dec 2022 10:01 IST

హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాకు చెందిన ఏకమ్‌జీత్‌ కౌర్‌ అనే బాలిక ‘మల్టీ స్పెషాలిటీ స్కూల్‌ బ్యాగ్‌’ను తయారుచేసింది. రాక్‌ఫోర్డ్‌ డే పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న ఏకమ్‌జీత్‌ ఇటీవలే ఇన్‌స్పైర్‌ స్టాండర్డ్‌ అవార్డ్‌ స్కీమ్‌ పోటీల్లో పాల్గొంది. ఆ సమయంలో ఆమె తయారు చేసిన స్కూల్‌ బ్యాగ్‌ను అక్కడకు తీసుకొచ్చింది. న్యాయనిర్ణేతలకు తన బ్యాగ్‌ ఉపయోగాలను వివరించగా.. వారంతా ఆశ్చర్యపోయారు. ‘‘కొంత మంది పిల్లలు పుస్తకాల సంచులు భుజాన వేసుకుని బస్సు కోసం వేచి ఉండటం చూశాను. అది వాళ్లకు ఇబ్బందిగా ఉండేది. దాంతో ఈ బ్యాగ్‌ తయారుచేశాను’’ అని ఆమె వివరించింది. ఈ సంచిలో ఓ ఫోల్డబుల్‌ కుర్చీ కూడా ఉందని, విద్యార్థులు అవసరమైతే కుర్చీ వేసుకుని కూర్చోవచ్చని చెప్పింది. పుస్తకాల బరువు మోయకుండా.. బ్యాగ్‌ను సులువుగా లాక్కెల్లేందుకు చక్రాలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించింది. దీని ధర రూ.500 నుంచి రూ.1,000 మధ్యలో ఉంటుందని ఏకమ్‌జీత్‌ కౌర్‌ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని