మండపంలోనే రూ.11లక్షల కట్నం తిరిగిచ్చేసిన అల్లుడు

వరకట్న దాహంతో భార్యలను వేధించే భర్తలను చూసుంటాం.

Published : 04 Dec 2022 05:20 IST

ముజఫర్‌నగర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌): వరకట్న దాహంతో భార్యలను వేధించే భర్తలను చూసుంటాం. ముహూర్తానికి ముందు అనుకున్నంత కట్నం ఇవ్వకపోతే వివాహం రద్దు చేసే వారినీ చూసుంటాం. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ అల్లుడు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి తనకు ఇచ్చిన కట్నాన్ని, ఆభరణాలను అత్తామామలకు తిరిగి ఇచ్చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ముజఫర్‌నగర్‌కు చెందిన సౌరభ్‌ చౌహాన్‌ అనే రెవెన్యూ అధికారికి.. విశ్రాంత ఆర్మీ జవాన్‌ కూతురు ప్రిన్స్‌కు శుక్రవారం తిటావి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లఖన్‌ గ్రామంలో వివాహం జరిగింది. ఆచారాల్లో భాగంగా అతడికి రూ.11 లక్షల నగదుతో పాటు కొన్ని ఆభరణాలను ఇచ్చారు. వరుడు వాటన్నింటినీ తిరిగి ఇచ్చి ఒక్క రూపాయిని మాత్రమే తీసుకున్నాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతడ్ని ప్రశంసలతో ముంచెత్తారు. సౌరబ్‌ను చూసి ఈ సమాజం ఎంతో నేర్చుకోవాలని అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని