ఆటోడ్రైవర్‌ నిజాయతీ

ఆటోలో ప్రయాణికులు మరిచిపోయిన బంగారు నగలను తిరిగి వారికే అప్పగించి ఓ ఆటోడ్రైవర్‌ తన నిజాయతీని చాటుకున్నారు.

Published : 04 Dec 2022 05:22 IST

 ప్రయాణికులు మరిచిపోయిన నగలు తిరిగి అప్పగింత

ఆటోలో ప్రయాణికులు మరిచిపోయిన బంగారు నగలను తిరిగి వారికే అప్పగించి ఓ ఆటోడ్రైవర్‌ తన నిజాయతీని చాటుకున్నారు. ఉత్తరాఖండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నైనితాల్‌ జిల్లాలోని హల్ద్‌వానీలో జరిగిన ఓ వివాహ వేడుకకు కొందరు ఆటోలో బయలుదేరారు. మండపం వద్ద ఆటో దిగారు. నగల సంచిని మరచిపోయారు. ఆ సంచిలో రూ.50 వేల నగదు, రూ.6 లక్షల విలువైన నగలు ఉన్నాయి. అనంతరం వివాహ మండపంలో నగల సంచి ఎక్కడుందని వెతకగా దొరకలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్‌ వల్లభ్‌ జోషి.. వాహనంలో నగల సంచి ఉండడాన్ని గమనించారు. అనంతరం కల్యాణ మండపానికి చేరుకుని పెళ్లి కుమార్తె బంధువులకు ఆ సంచిని అప్పగించారు. దీంతో అందరూ ఆయన్ని అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని