ఈ శతాబ్ది గాన గంధర్వుడు ఘంటసాల

ఓ సాధారణ కుటుంబంలో జన్మించి.. ఈ శతాబ్ది గాయకుడిగా, గాన గంధర్వుడిగా ఎదిగిన మహోన్నతమైన వ్యక్తి ఘంటసాల అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Updated : 05 Dec 2022 05:48 IST

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఓ సాధారణ కుటుంబంలో జన్మించి.. ఈ శతాబ్ది గాయకుడిగా, గాన గంధర్వుడిగా ఎదిగిన మహోన్నతమైన వ్యక్తి ఘంటసాల అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కళా ప్రదర్శిని, ఘంటసాల కుటుంబీకుల ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి వేడుకలు ఆదివారం చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో జరిగాయి. వెంకయ్యనాయుడు, తమిళనాడు మంత్రి మనో తంగరాజ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గాయని ఎల్‌ఆర్‌ ఈశ్వరి, సినీ కళాదర్శకుడు తోట తరణి, డ్రమ్స్‌ శివమణి, అవసరాల కన్యాకుమారి, సుధారాణి రఘుపతి, తాయన్బన్‌లకు పురస్కారాల’ను అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఘంటసాల గాయకుడిగానే కాకుండా స్వాతంత్య్ర పోరాటయోధుడిగా కూడా గుర్తింపు పొందారన్నారు. ఒక కళాకారుడి శతజయంతి వేడుకలో మరెంతోమంది కళాకారులను గౌరవించడం అద్భుతమైన సంప్రదాయమని కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని