దండలు మార్చుకుంటుండగా వధువుకు గుండెపోటు

ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన కొద్ది నిమిషాలకే వధువు మృతి చెందింది.

Published : 05 Dec 2022 04:37 IST

పెళ్లి మండపంలోనే మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన కొద్ది నిమిషాలకే వధువు మృతి చెందింది. లఖ్‌నవూ జిల్లా బడ్వానా గ్రామంలో రాజ్‌పాల్‌ అనే వ్యక్తి కుమార్తె శివంగికి వివాహం జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులు కలిసి ఊరేగింపుగా బయలుదేరారు. ఈ తంతులో అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు. ఊరేగింపు ముగిసిన తర్వాత.. వధూవరులు పెళ్లిమండపంలో దండలు మార్చుకున్నారు. అదే సమయంలో పెళ్లి కూతురు ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో విషాదం నెలకొంది. పెళ్లికి 20 రోజుల ముందు నుంచే శివంగికి ఆరోగ్యం సరిగా లేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు