ఓసీడీ చికిత్సకు మెజార్టీ బాధితులు దూరం

మాటిమాటికీ అదే పనిచేయడం (అబ్సెసివ్‌-కంపల్సివ్‌ డిజార్డర్‌-ఓసీడీ) అనేది పెద్ద సమస్యే.

Published : 05 Dec 2022 04:57 IST

దిల్లీ: మాటిమాటికీ అదే పనిచేయడం (అబ్సెసివ్‌-కంపల్సివ్‌ డిజార్డర్‌-ఓసీడీ) అనేది పెద్ద సమస్యే. తీవ్ర మానసిక రుగ్మతల జాబితాలో ఇది ఐదో స్థానంలో ఉంది. అయితే దీన్ని అనేక మంది సమస్యగా భావించడంలేదని, చికిత్స తీసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా ప్రకారం.. ఓసీడీ సమస్య ఉన్నవారిలో 35-40 శాతం మంది మాత్రమే వైద్య సహాయం తీసుకుంటున్నారు. అందులోనూ ప్రామాణిక చికిత్స పొందుతున్నవారు 10 శాతం కన్నా తక్కువే. రుగ్మత గురించి సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ‘‘నిర్దిష్ట చికిత్స విధానాలతో ఓసీడీ బాధితులకు ప్రయోజనం ఉంటుంది. రుగ్మత లక్షణాలు తగ్గుతాయి. జీవన నాణ్యత మెరుగుపడుతుంది’’ అని దిల్లీకి చెందిన న్యూరో సైకియాట్రిస్ట్‌ నీలేశ్‌ తివారి పేర్కొన్నారు. ఓసీడీకి చికిత్స సమర్థమైందని, చాలావరకూ రోగులు దీని తర్వాత కోలుకున్నారని వివరించారు. స్వల్పస్థాయి కేసుల్లో కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ సరిపోతుందన్నారు. తీవ్ర కేసుల్లో యాంటీ డిప్రెసెంట్‌ ఔషధాలను సూచిస్తుంటామని చెప్పారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు