ఈడబ్ల్యూఎస్‌ తీర్పులో లోపాలు ఉన్నాయి

ఆర్థికంగా బలహీన వర్గాల (ఈబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత నెల 7న ఇచ్చిన మెజారిటీ తీర్పు(3-2)పై సోమవారం సుప్రీంకోర్టులో తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే పిటిషన్‌ వేసింది.

Published : 06 Dec 2022 04:59 IST

సమీక్షించండి.. సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్‌

దిల్లీ: ఆర్థికంగా బలహీన వర్గాల (ఈబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత నెల 7న ఇచ్చిన మెజారిటీ తీర్పు(3-2)పై సోమవారం సుప్రీంకోర్టులో తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే పిటిషన్‌ వేసింది. తీర్పులో లోపాలు ఉన్నాయని, సమీక్షించాలని కోరింది. ఆర్థిక వెనుకబాటు కారణంతో రిజర్వేషన్లు ఇవ్వకూడదని 1992లో ఇందిరా సాహ్ని కేసులో తొమ్మిది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా పేర్కొందని తెలిపింది. ఈడబ్ల్యూఎస్‌ పరిధి నుంచి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలను తప్పిస్తూ చేసిన 103వ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడం లేదని మెజారిటీ ధర్మాసనం పేర్కొనడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సామాజిక వెనుకబాటు, చారిత్రక అణిచివేత ఆధారంగా రాజ్యాంగంలోని అధికరణం 15(4), 16(4) కింద రిజర్వేషన్లు కల్పించారని.. ఆ రకంగా చూసినా తాజా తీర్పులో లోపాలు ఉన్నాయని పేర్కొంది. ఈడబ్ల్యూఎస్‌ తీర్పుపై కాంగ్రెస్‌ నేత జయా ఠాకూర్‌ కూడా గత నెల 23న సమీక్ష పిటిషన్‌ వేశారు. ఆమె కూడా తీర్పులోని లోపాలనే ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని