వచ్చే నెలలో సీఎస్‌లతో ప్రధాని మోదీ భేటీ

కేంద్ర బడ్జెట్‌ 2023-24ను పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెలలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు.

Published : 06 Dec 2022 04:59 IST

బడ్జెట్‌ నేపథ్యంలోనే

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌ 2023-24ను పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెలలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి యువ కలెక్టర్లు, వివిధ మంత్రిత్వ శాఖల్లోని అధికారులూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల రెండో జాతీయస్థాయి సమావేశం వచ్చే నెలలో దిల్లీలో జరగనుందని, కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇది కీలక ముందడుగు అవుతుందని సోమవారమిక్కడ ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల తొలి జాతీయస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని