తనను తానే పందెం కాసుకున్న మహిళ

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన ఓ మహిళ పందేల్లో వేల రూపాయలు పోగొట్టుకుంది.

Published : 06 Dec 2022 04:59 IST

యూపీలో లూడో బానిస నిర్వాకం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన ఓ మహిళ పందేల్లో వేల రూపాయలు పోగొట్టుకుంది. అక్కడితో ఆగకుండా తనను తానే పందెం కాసుకుంది. ఆ ఆటలోనూ ఓడిపోయి చివరకు ఇంటి యజమాని దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్‌ జిల్లాకు చెందిన రేణుకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఉపాధి నిమిత్తం ఆరు నెలల క్రితం రాజస్థాన్‌ వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేస్తూ భార్యకు డబ్బు పంపించేవారు. ఆన్‌లైన్‌ గేమ్‌ లూడోకు బానిసైన రేణు.. ఆ డబ్బును పందేల్లో పెట్టి పోగొట్టుకునేది. తాను అద్దెకుండే ఇంటి యజమానితో తరచూ లూడో గేమ్‌ ఆడే రేణు.. ఓ రోజు పందెంలో డబ్బంతా పోగొట్టుకుంది. అంతటితో ఆగకుండా చివరకు తనను తానే పందెం కాసి గేమ్‌ ఆడింది. అప్పుడు కూడా ఓడిపోవడంతో యజమాని ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు ఫోన్‌ చేసి చెప్పడంతో ఆయన ప్రతాప్‌గఢ్‌ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనంతా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పందెం ఓడిపోవడంతో ఇంటి యజమానితో కలిసి ఉంటోన్న రేణు.. ఇప్పుడు అతడిని వదిలి రానని చెబుతుండడం కొసమెరుపు!

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు