విద్య, పరిశోధన రంగాల్లో.. భారత్‌, జర్మనీల మధ్య కీలక ఒప్పందం

భారత్‌, జర్మనీ దేశాల ప్రజలు ఒకరి దేశంలో మరొకరు విద్యాభ్యాసం, పరిశోధన, ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే కీలక భాగస్వామ్య ఒప్పందంపై రెండు దేశాలు సోమవారం సంతకాలు చేశాయి.

Published : 06 Dec 2022 05:38 IST

దిల్లీ: భారత్‌, జర్మనీ దేశాల ప్రజలు ఒకరి దేశంలో మరొకరు విద్యాభ్యాసం, పరిశోధన, ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే కీలక భాగస్వామ్య ఒప్పందంపై రెండు దేశాలు సోమవారం సంతకాలు చేశాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జర్మనీ విదేశాంగ మంత్రి ఎనలీనా బేయర్‌ బాక్‌లు ఈ మేరకు సోమవారమిక్కడ సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌ యుద్ధం, అఫ్గానిస్థాన్‌ పరిస్థితులు, పాకిస్థాన్‌ నుంచి ఎదురవుతున్న సీమాంతర ఉగ్రవాదం వంటి సమస్యలపై చర్చించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బేయర్‌ బాక్‌ భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 21వ శతాబ్దంలో ప్రపంచ వ్యవస్థను, ముఖ్యంగా ఇండో పసిఫిక్‌ స్థితిగతులను తీర్చిదిద్దడంలో భారత్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. భారత్‌ను సందర్శించడమంటే ఆరో వంతు ప్రపంచాన్ని సందర్శించడమేనన్నారు. గత 15 ఏళ్ళలో భారత్‌ 40 కోట్ల మందిని దుర్భర పేదరికం నుంచి బయట పడేయడం నిజంగా అద్భుతమని చెప్పారు. భారతదేశం జర్మనీకి సహజ భాగస్వామి అని అభివర్ణించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు