గిన్నిస్‌ రికార్డు సాధించిన నాగ్‌పుర్‌ మెట్రో

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ మెట్రో గిన్నిస్‌ రికార్డు సాధించింది.

Published : 07 Dec 2022 04:58 IST

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ మెట్రో గిన్నిస్‌ రికార్డు సాధించింది. ఇక్కడి 3.14 కిలోమీటర్ల డబుల్‌ డెకర్‌ వయాడక్ట్‌ మెట్రో.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తింపు పొందింది. ఇది వార్ధా రోడ్‌ ప్రాంతంలో ఉంది. ఈ డబుల్‌ డెకర్‌ వయాడక్ట్‌ ఇప్పటికే ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణంగా గుర్తింపు పొందింది. దీని పైభాగంలో మెట్రోరైలు, మధ్యలో హైవే ఫ్లైఓవర్‌ ఉన్నాయని మహా మెట్రో ఎండీ బ్రిజేష్‌ దీక్షిత్‌ తెలిపారు. దిగువన ప్రస్తుతమున్న రోడ్డు కొనసాగుతుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని