Diamond : కార్మికుడికి రూ.12 లక్షల విలువైన వజ్రం!

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లాకు చెందిన హుక్మాన్‌ అహిర్వార్‌ అనే కార్మికుడు వజ్రాల(Diamonds) మీద మక్కువతో, పన్నాలోని వజ్రాల గనిలో కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు.

Updated : 07 Dec 2022 11:19 IST

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌ జిల్లాకు చెందిన హుక్మాన్‌ అహిర్వార్‌ అనే కార్మికుడు వజ్రాల(Diamond)  మీద మక్కువతో, పన్నాలోని వజ్రాల గనిలో కొంత భూమిని లీజుకు తీసుకున్నాడు. చాన్నాళ్లు శ్రమించినా అతనికి 8 చిన్న వజ్రాలు మాత్రమే లభించాయి. గనుల తవ్వకం కారణంగా చేసిన అప్పులను తీర్చడానికి తనకున్న రెండున్నర ఎకరాల భూమిని సైతం అతను అమ్మేశాడు. వజ్రాల అన్వేషణను మాత్రం ఆపలేదు. ఈ క్రమంలో సోమవారం అతడి కష్టానికి ఫలితం దక్కింది. 4.5 క్యారెట్ల వజ్రం దొరికింది. అహిర్వార్‌ దానిని వజ్రాల కార్యాలయంలో జమ చేశాడు. ఈ వజ్రానికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మేర ధర పలుకుతుందని అధికారులు అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని