ఐసీఎంఆర్‌ డేటాబేస్‌పై సైబర్‌ దాడి

దేశంలోని పెద్ద ఆస్పత్రుల్లో రోగుల వివరాలు లక్ష్యంగా సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. ఇటీవల దిల్లీ ఎయిమ్స్‌, తమిళనాడులోని ఓ ఆస్పత్రి డేటాబేస్‌పై దాడి చేశారు.

Published : 07 Dec 2022 04:57 IST

దిల్లీ: దేశంలోని పెద్ద ఆస్పత్రుల్లో రోగుల వివరాలు లక్ష్యంగా సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. ఇటీవల దిల్లీ ఎయిమ్స్‌, తమిళనాడులోని ఓ ఆస్పత్రి డేటాబేస్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో నవంబరు 30న.. భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సర్వర్‌ను హ్యాక్‌ చేసేందుకు ఆరువేల సార్లు సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నించారు. సర్వర్‌ను వారు హ్యాక్‌ చేయలేకపోయారని కేంద్రం  తెలిపింది. ఈ దాడికి యత్నించిన హాంకాంగ్‌కు చెందిన ఐపీ అడ్రస్‌ గుర్తించి బ్లాక్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని