ప్రధానిపై ట్వీట్‌.. తృణమూల్‌ నేత అరెస్ట్‌

గుజరాత్‌లోని మోర్బీ వద్ద తీగల వంతెన కూలిపోవడంపై తప్పుడు వార్తగా చెబుతున్నదానిని సమర్థించేలా ట్విటర్లో స్పందించినందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలేని గుజరాత్‌ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున రాజస్థాన్‌లోని జైపుర్‌లో అరెస్ట్‌ చేశారు.

Updated : 07 Dec 2022 06:06 IST

అహ్మదాబాద్‌/ కోల్‌కతా: గుజరాత్‌లోని మోర్బీ వద్ద తీగల వంతెన కూలిపోవడంపై తప్పుడు వార్తగా చెబుతున్నదానిని సమర్థించేలా ట్విటర్లో స్పందించినందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలేని గుజరాత్‌ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున రాజస్థాన్‌లోని జైపుర్‌లో అరెస్ట్‌ చేశారు. అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచగా రెండ్రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. పోలీసుల చర్యపై తృణమూల్‌ మండిపడింది. గోఖలే ఎలాంటి తప్పు చేయలేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమర్థించారు. ప్రతీకారంతోనే భాజపా ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు. మోర్బీలో మోదీ పర్యటనకు రూ.30 కోట్లు ఖర్చయిందనీ, ఆయన ప్రచార గొప్పల కోసం 135 మంది అమాయకుల ప్రాణాలు బలైపోయాయని సాకేత్‌ ట్వీట్‌ చేశారు. సమాచార హక్కు చట్టం కింద వెల్లడైన సమాచారం ఒక పత్రికలో ప్రచురితమైందని నిందితుడు ట్వీట్‌ చేసినా అసలు అలాంటి కథనమే పత్రికలో రాలేదని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని