Bihar: ప్రాణాలను పణంగా పెట్టి.. రైలు నుంచి రూ.లక్షల విలువైన చమురు చోరీ

బిహార్‌లో కొందరు యువకులు ప్రాణాలను పణంగా పెట్టిమరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కదులుతున్న గూడ్సు రైలు ట్యాంకర్ల నుంచి చమురు చోరీకి పాల్పడుతున్నారు.

Updated : 07 Dec 2022 09:34 IST

బిహార్‌లో కొందరు యువకులు ప్రాణాలను పణంగా పెట్టిమరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కదులుతున్న గూడ్సు రైలు ట్యాంకర్ల నుంచి చమురు చోరీకి పాల్పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బిహ్‌టాలోని హెచ్‌పీసీఎల్‌ కంపెనీ వివిధ ప్రాంతాలకు డీజిల్‌, పెట్రోల్‌ను గూడ్సు రైలు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. నాగాజీ వంతెనపైకి రైలు రాగానే స్థానిక యువకులు ట్యాంకర్ల సీల్‌ తొలగించి పెద్ద పెద్ద బకెట్‌లతో రూ.లక్షల విలువైన చమురును ఎత్తుకెళుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని