ఈ రిక్షా కార్మికులు భాషాసంపన్నులు

వారంతా రిక్షా కార్మికులు. ఏనాడూ బడికి వెళ్లలేదు. అయినా ఆంగ్ల భాషలో అద్భుతంగా మాట్లాడతారు.

Published : 07 Dec 2022 05:38 IST

బర్డ్‌ పార్కులో విదేశీయులకు గైడ్లుగా సేవలు

వారంతా రిక్షా కార్మికులు. ఏనాడూ బడికి వెళ్లలేదు. అయినా ఆంగ్ల భాషలో అద్భుతంగా మాట్లాడతారు. మరికొన్ని విదేశీ భాషలను సైతం తడుముకోకుండా మాట్లాడగలరు. వారే రాజస్థాన్‌లోని ఓ నేషనల్‌ పార్కులో ఉపాధి పొందే రిక్షా కార్మికులు. భరత్‌పుర్‌ జిల్లాలోని కెవలాదేవ్‌ నేషనల్‌ పార్కుకు దాదాపు 370 రకాల పక్షులు వేల సంఖ్యలో వలస వస్తాయి. వీటిని చూడడానికి రోజూ వందల సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ఈ పార్కులో సొంత వాహనాల్లో తిరగడానికి అనుమతి ఉండదు. రిక్షాలో మాత్రమే వెళ్లాలి. ఇందుకోసం పార్కులోనే 150 మంది రిక్షా కార్మికులు ఉంటారు. వీరంతా పర్యాటకులను రిక్షాలో ఎక్కించుకుని పార్కునంతా చూపిస్తారు. పార్కులో ఉండే విశేషాలను వారి భాషలోనే వివరిస్తారు. ఇంగ్లిష్‌తో పాటు ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, డచ్‌, వంటి భాషలను సులభంగా మాట్లాడతారు. పర్యాటకులు గైడ్‌లను వెంట తెచ్చుకోని సందర్భాల్లో రిక్షా కార్మికులే వారికి గైడ్‌లుగా వ్యవహరిస్తారు. ‘‘1993 నుంటి ఈ పార్కులో రిక్షా నడుపుతున్నాను. అనేక ఐరోపా భాషలు నాకు వచ్చు. జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ మొదలైన దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వారి భాషల్లోనే పక్షుల గురించి సమాచారం తెలియజేస్తాను’’ అని జస్వంత్‌ సింగ్‌ అనే రిక్షా కార్మికుడు చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం పార్కు నిర్వహకులు ప్రత్యేకంగా ఫ్రెంచ్‌ భాష శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా టూరిస్ట్‌ గైడ్‌లు, రిక్షా కార్మికులకు ఫ్రెంచ్‌ భాషపై అవగాహన ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని