Electric vehicle: 6 సీట్ల ఈ-బైక్‌.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 150 కి.మీ. ప్రయాణం!

బైక్‌పై ఎంతమంది ప్రయాణించొచ్చు? సాధారణంగా ఇద్దరు! మహా అయితే ముగ్గురు! కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్‌ జిల్లా లోహ్రా గ్రామానికి చెందిన అష్షద్‌ అబ్దుల్లా అనే యువకుడు.. ఆరుగురు ప్రయాణించేందుకు వీలుగా సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ను తయారుచేశాడు.

Updated : 07 Dec 2022 08:25 IST

బైక్‌పై ఎంతమంది ప్రయాణించొచ్చు? సాధారణంగా ఇద్దరు! మహా అయితే ముగ్గురు! కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆజంగఢ్‌ జిల్లా లోహ్రా గ్రామానికి చెందిన అష్షద్‌ అబ్దుల్లా అనే యువకుడు.. ఆరుగురు ప్రయాణించేందుకు వీలుగా సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ను తయారుచేశాడు. 12వ తరగతి తర్వాత ఐటీఐ-ఎలక్ట్రీషియన్‌ కోర్సు పూర్తిచేసిన అతడు.. ప్రస్తుతం బీసీఏ చదువుతున్నాడు. తనకు వచ్చిన చిన్న ఆలోచనతో.. ఎలక్ట్రిక్‌ బైక్‌ను ఆవిష్కరించాడు.

ఇందుకోసం ముందుగా గూగుల్‌, యూట్యూబ్‌ల ద్వారా విద్యుత్తు వాహనాల గురించి తెలుసుకున్నాడు. ఆపై నెల రోజులు కష్టపడి తాను అనుకున్నది సాధించాడు. ఈ బైక్‌తో పర్యావరణానికి హాని చేయకుండా.. అతితక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఈ బైక్‌ గురించి తెలుసుకున్న వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర.. అబ్దుల్లా ప్రతిభను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. పెట్రోల్‌ ధర రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాత సామానును ఉపయోగించుకొని, కేవలం రూ.10-12 వేల ఖర్చుతో ఎలక్ట్రిక్‌ బైక్‌ను తాను తయారుచేసినట్లు అబ్దుల్లా తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని