జాఫ్నా - చెన్నై విమాన సేవలు వచ్చే వారంలో పునరుద్ధరణ

మూడేళ్ల క్రితం నిలిచిపోయిన జాఫ్నా - చెన్నై విమాన సేవలను వచ్చే వారం పునరుద్ధరిస్తామని శ్రీలంక విమానయానశాఖ మంత్రి నిమల్‌ శ్రీపాల డిసిల్వా సోమవారం పార్లమెంటులో వెల్లడించారు.

Published : 07 Dec 2022 05:37 IST

కొలంబో: మూడేళ్ల క్రితం నిలిచిపోయిన జాఫ్నా - చెన్నై విమాన సేవలను వచ్చే వారం పునరుద్ధరిస్తామని శ్రీలంక విమానయానశాఖ మంత్రి నిమల్‌ శ్రీపాల డిసిల్వా సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. ఈ నెల 12 నుంచి ప్రారంభం కావచ్చని తెలిపారు. శ్రీలంకకు ప్రధాన ఆదాయ వనరు అయిన పర్యాటకం అభివృద్ధికి ఈ విమానసేవల పునరుద్ధరణ దోహదపడుతుందని భావిస్తున్నారు. 2019లో జాఫ్నా అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి శ్రీలంక, భారత్‌ ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూర్చాయి. దీన్ని గతంలో పలాలీ విమానాశ్రయంగా పిలిచేవారు. పేరు మార్చాక.. చెన్నై నుంచి వెళ్లే విమానమే అక్కడ దిగే తొలి అంతర్జాతీయ విమానం కానుంది. గతంలో చెన్నై నుంచి పలాలీకి ఎయిరిండియా వారంలో మూడు సర్వీసులు నడిపేది. 2019 నవంబరులో శ్రీలంకలో ప్రభుత్వం మారాక జాఫ్నాకు చెన్నై నుంచి విమాన సేవలను నిలిపివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని