కలుషిత నీరు తాగి ఇద్దరి దుర్మరణం

ప్రభుత్వ పైపులైన్ల ద్వారా సరఫరా అయిన మంచినీరు కలుషితం కావడంతో రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లా హిండైన్‌ నగరంలో 12 ఏళ్ల బాలుడు, ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు.

Published : 08 Dec 2022 04:40 IST

124 మందికి అస్వస్థత
విచారణకు ఆదేశించిన రాజస్థాన్‌ ప్రభుత్వం

ప్రభుత్వ పైపులైన్ల ద్వారా సరఫరా అయిన మంచినీరు కలుషితం కావడంతో రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లా హిండైన్‌ నగరంలో 12 ఏళ్ల బాలుడు, ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. 124 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాలుడు మంగళవారం ఉదయం, వృద్ధుడు బుధవారం మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం (పీహెచ్‌ఈడీ) మంత్రి మహేశ్‌ జోషి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు హిండైన్‌ నగరంలో ఇంటింటి సర్వే చేపట్టారు. మొత్తం 750కిపైగా ఇళ్లకు ముందుజాగ్రత్తగా అవసరమైన ఔషధాలను పంపిణీ చేశారు. అస్వస్థతకు గురైన 124 మందిని ఆసుపత్రుల్లో చేర్పించగా వారిలో 63 మంది ఇప్పటికే డిశ్ఛార్జి అయ్యారని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు