పాలు ఇస్తున్న ఏడాది వయసున్న దూడ

ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పుర్‌లో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. సంతానం లేకుండా ఏడాది వయసున్న ఓ దూడ పాలిస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Published : 08 Dec 2022 04:40 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పుర్‌లో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. సంతానం లేకుండా ఏడాది వయసున్న ఓ దూడ పాలిస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఖోరాబర్‌లోని జార్వా నివాసి గిరి నిషాద్‌  15 రోజుల క్రితం ఓ దూడను తన ఇంటికి తీసుకువచ్చాడు. వారం రోజులు గడిచిన తర్వాత ఆ దూడ పాలు ఇవ్వడం ప్రారంభించింది. మొదట్లో పాలు తక్కువగా ఇచ్చేదని.. ఇప్పుడు 4 లీటర్ల పాలు ఇస్తుందని యజమాని గిరి నిషాద్‌ చెప్పారు. దూడను కుటుంబ సభ్యులు పూజిస్తున్నారు. ఈ వింతను చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కొందరైతే దూడ నుంచి పాలు తీసి పరీక్షిస్తున్నారు. ‘‘గర్భం లేకుండా పాలు ఇవ్వడం, బిడ్డకు జన్మనిచ్చే ప్రక్రియలు అనేవి హార్మోన్ల మార్పు కారణంగా జరుగుతాయి. ఇంతకు ముందు దూడలో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చికిత్సలో భాగంగా వాడిన మందులు కూడా ప్రభావం చూపించవచ్చు’’ అని పశువైద్యుడు యోగేష్‌ సింగ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని