చోరీ అనుమానంతో చిన్నారికి చెప్పులదండ

సహ విద్యార్థినికి చెందిన రూ.400 డబ్బు అపహరించిందన్న అనుమానంతో అయిదో తరగతి చదువుతున్న ఓ బాలికకు చెప్పులదండ వేసి, దెయ్యంలా అలంకరణ చేసి ఆవరణలో తిప్పిన అమానుష ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్ర హాస్టలులో వెలుగుచూసింది.

Published : 08 Dec 2022 05:22 IST

బైతూల్‌: సహ విద్యార్థినికి చెందిన రూ.400 డబ్బు అపహరించిందన్న అనుమానంతో అయిదో తరగతి చదువుతున్న ఓ బాలికకు చెప్పులదండ వేసి, దెయ్యంలా అలంకరణ చేసి ఆవరణలో తిప్పిన అమానుష ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్ర హాస్టలులో వెలుగుచూసింది. హాస్టలు పర్యవేక్షకురాలి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఘటనపై బైతూల్‌ జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. దమిజిపుర గ్రామంలోని గిరిజన బాలికల ప్రభుత్వ వసతిగృహం వారం రోజుల కిందట ఈ దుశ్చర్యకు వేదికగా మారింది. బాలిక కుటుంబసభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్‌ అమన్‌వీర్‌ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. హాస్టలు పర్యవేక్షకురాలిని ఆ విధుల నుంచి తప్పించినట్లు గిరిజన వ్యవహారాల శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శిల్పా జైన్‌ తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత బాధిత బాలిక హాస్టలులో ఉండేందుకు ససేమిరా అంటున్నట్లు ఆమె తండ్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని