ప్లాస్టిక్‌ సంచిలో అంతిమయాత్ర

కర్ణాటక రాష్ట్రంలోని యళందూరులో ఓ హృదయ విదారక దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది.

Published : 08 Dec 2022 05:27 IST

భార్య మృతదేహాన్ని సంచిలో ఉంచి  భుజంపై వేసుకొని తీసుకువెళ్లిన భర్త

చామరాజనగర, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రంలోని యళందూరులో ఓ హృదయ విదారక దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. తన జీవన సహచరి అంతిమయాత్రకు చేతిలో చిల్లిగవ్వ లేక చివరికి ప్లాస్టిక్‌ సంచిలో ఆమె మృతదేహాన్ని చుట్టుకుని ఓ భర్త తీసుకెళ్తున్న దృశ్యం హృదయాలను ద్రవింపజేసింది. మండ్య జిల్లా మళవళ్లికి చెందిన కాళమ్మ, రవి భార్యాభర్తలు. ఇద్దరూ చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించుకొని, వాటిని విక్రయిస్తూ జీవనం సాగించేవారు. యళందూరు పట్టణం అటవీశాఖ కార్యాలయం సమీపంలో బెల్లం తయారీ కేంద్రం వద్ద గత పదిహేను రోజులుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో మంగళవారం అర్ధరాత్రి చనిపోయిన కాళమ్మ (26) మృతదేహాన్ని తరలించేందుకు ఆమె భర్త రవి (26) వద్ద రూపాయి కూడా లేదు. శ్మశానవాటిక వరకు మృతదేహాన్ని ఎలా తరలించాలో అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో రవి పుట్టెడు దుఃఖంతో తన భార్య శవాన్ని ప్లాస్టిక్‌ గోనె సంచిలో ఉంచి భుజాన వేసుకుని తీసుకెళ్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ సమాచారం అందిన వెంటనే వచ్చిన పోలీసులు రవి నుంచి వివరాలు తీసుకున్నారు. పంచనామాకు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు