Supreme Court: జల్లికట్టును నెత్తుటి క్రీడని ఎలా అంటాం: సుప్రీంకోర్టు
తమిళనాడు సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు గురువారం ప్రకటించింది.
ఎవరూ ఆయుధాలు వాడరుగా..!
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటన
దిల్లీ: తమిళనాడు సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టులో హింస ఉంటుందని, అంత మాత్రానా దాన్ని నెత్తుటి క్రీడ అనలేమని పేర్కొంది. ఈ క్రీడలో రక్తం చిందడం యాదృచ్ఛికం మాత్రమేనని, అంతే తప్ప నెత్తురు కళ్ల చూడాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో ఎవరూ పాల్గొనరని తెలిపింది. జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్‌లు ధర్మాసనంలోని ఇతర సభ్యులు. జల్లికట్టుకు అనుమతిస్తూ 2017లో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టానికి తమిళనాడు సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ ధర్మాసనం విచారిస్తోంది. అంతకుముందు విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్.. జల్లికట్టును నెత్తుటి క్రీడగా అభివర్ణించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘అలా ఎలా అంటారు. ఎవరూ ఆయుధం వాడరుగా... ప్రజలు ఖాళీ చేతులతో ఉంటారు. హింస ఉండొచ్చు కానీ.. నెత్తుటి క్రీడ అనలేం’’ అని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు