‘ముక్కు చిన్నగా ఉంది.. ఆ అబ్బాయి నాకు వద్దు’

వరుడు ముక్కు చిన్నగా ఉందని.. ఏకంగా పెళ్లే ఇష్టం లేదని బాంబు పేల్చింది వధువు.

Updated : 09 Dec 2022 07:37 IST

పెళ్లి రద్దు చేసుకున్న వధువు

రుడు ముక్కు చిన్నగా ఉందని.. ఏకంగా పెళ్లే ఇష్టం లేదని బాంబు పేల్చింది వధువు. ఈ ఊహించని ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో వెలుగుచూసింది. ఓ గ్రామంలో యువతి, యువకుడికి వివాహం నిశ్చయమైంది. వరుడి కుటుంబం వధువు ఇంటికి బుధవారం ఊరేగింపుగా వచ్చింది. దీంతో అమ్మాయి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఇంతలోనే అక్కడ ఉన్న కొంత మంది మహిళలు వరుడి ముక్కు చాలా చిన్నగా ఉందని గుసగుసలాడుకున్నారు. ఇది విన్న వధువు అతడిని చూసేందుకు వెళ్లింది. నిజంగానే ముక్కు చిన్నగా ఉందని వెంటనే పెళ్లికి నిరాకరించింది. పెళ్లి కుమారుడి ముక్కు చిన్నగా ఉంది కాబట్టి తాను వివాహం చేసుకోనని తెగేసి చెప్పింది. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు వధువును ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా.. తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని