మహిళా అధికారుల విషయంలో మీ వైఖరి సరిగా లేదు

మహిళా అధికారుల పదోన్నతుల విషయంలో సైన్యం అనుసరిస్తున్న వైఖరిని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ‘మీ ఇంటిని చక్కదిద్దుకోండి’ అంటూ వ్యాఖ్యలు చేసింది.

Published : 10 Dec 2022 06:38 IST

సైన్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

దిల్లీ: మహిళా అధికారుల పదోన్నతుల విషయంలో సైన్యం అనుసరిస్తున్న వైఖరిని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ‘మీ ఇంటిని చక్కదిద్దుకోండి’ అంటూ వ్యాఖ్యలు చేసింది. తమ కంటే జూనియర్లైన పురుష అధికారులకు పదోన్నతులిస్తూ తమకు మాత్రం ఇవ్వడం లేదంటూ 34 మంది మహిళా అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సీజేఐ..‘‘మీరు మహిళా అధికారుల విషయంలో న్యాయంగా ప్రవర్తించడం లేదని మేం భావిస్తున్నాం’’ అని సైన్యం తరఫున హాజరైన న్యాయవాదిని ఉద్దేశించి అన్నారు. మహిళా అధికారుల విషయంలో ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని పేర్కొన్నారు. అప్పటివరకు పురుష అధికారుల పదోన్నతుల ఫలితాలను వెల్లడి చేయొద్దని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని