భారత్‌, పాక్‌ బలగాల మధ్య కాల్పులు

భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌), పాకిస్థాన్‌ రేంజర్ల మధ్య శుక్రవారం రాత్రి కాల్పులు జరిగాయి. రాజస్థాన్‌ వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలోని అనూప్‌గఢ్‌ వద్ద ఈ ఘటన జరిగింది.

Published : 10 Dec 2022 05:24 IST

దిల్లీ: భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌), పాకిస్థాన్‌ రేంజర్ల మధ్య శుక్రవారం రాత్రి కాల్పులు జరిగాయి. రాజస్థాన్‌ వెంబడి ఉన్న అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలోని అనూప్‌గఢ్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ఇందులో భారతీయులెవరూ గాయపడలేదని మన దేశ అధికారులు తెలిపారు. పొలాలకు వెళుతున్న రైతులకు రక్షణగా బయలుదేరిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బందిపై మొదట పాక్‌ దళాలే కాల్పులకు దిగాయని చెప్పారు. దీన్ని తాము తిప్పికొట్టామన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య శనివారం ఫ్లాగ్‌ మీటింగ్‌ జరిగే అవకాశం ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని